రెండు భారీ సినిమాల కోసం నయనతార ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి ముందుకొస్తుంది. సైరా సినిమా కోసం ఈమె ప్రమోషన్ చేయబోతుందనే వార్తలు నెట్టింట్లో గుసగుసలాడుతున్నాయి. అయితే ఇందులో నటించడానికి ఏకంగా 7 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయినా ప్రతీ సినిమాకు ముందు ఎంత పారితోషికం తీసుకున్నా కూడా ప్రమోషన్‌కు మాత్రం రానని ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ‘సైరా’ కోసం ఆమె కదులుతుందనే తెలుస్తుంది. ప్రమోషన్ కోసం ఎప్పుడు రాని ఈ భామ ఇప్పుడు తన పద్దతి మార్చుకుంటోంది.
రామ్ చరణ్ ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు ప్రమోషన్ చేయబోతుంది. ఈ సినిమాతో పాటు విజయ్‌తో నటిస్తున్న బిగిల్ సినిమాకు కూడా ప్రమోషన్ చేయబోతుందట నయనతార. ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు నయన్ హాజరు అవుతుందని తెలుస్తుంది. సైరా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చెన్నై, హైదరాబాద్ లలో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వాటికి నయన్ వస్తుందనే తెలుస్తుంది. దాంతో పాటు సెప్టెంబర్ 19న జరుగబోయే ఆడియో వేడుకకు కూడా నయనతారను రావాల్సిందిగా చిత్రయూనిట్ ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఏం జరిగిందో కానీ…నయనతార ఇప్పుడు మాత్రం తన పద్దతిని మార్చేసుకుంది.
ముస్లింలపై విరుచుకుపడటం తగదు..మోదీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు