telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్…

కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో టపాసులపై ప్రభుత్వం నిషేధం విధించింది.  దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది.  ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.  రాష్ట్రంలోని అన్ని బాణాసంచా దుకాణాలను మూసెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ఆదేశించింది.  తీసుకున్న చర్యల గురించి నవంబర్ 16 లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించింది. దీపావళి టపాసులను కాల్చడం వలన గాలిలో వాయుకాలుష్యం పెరుగుతుంది ఫలితంగా శ్వాసవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.  పైగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది.  దీంతో ముందు జాగ్రత్తగా చాలా రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పండగ రెండు రోజుల ముందు నిషేధం విధిస్తే కోట్ల రూపాయలు నష్టపోతామని పిటిషన్ లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతున్నది. చూడాలి మరి సుప్రీం కోర్టు ఏం అంటుంది అనేది.

Related posts