telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చేపల్లో కరోనా… షాక్ అయిన చైనా

చెన్నై నుంచి వచ్చిన కరోనా ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది.  ఇప్పటికే ఐదు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనాకు పుట్టినిల్లయిన చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులను నిశితంగా పరిశీలిస్తోంది. ఇండియాలోని బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి చైనా చేపలను దిగుమతి చేసుకుంది.  అయితే, ఈ చేపల్లో కరోనా వైరస్ ఉన్నట్టుగా చైనా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.  కటిల్ ఫిష్ ప్యాకేజీలలోని మూడు శాంపిల్స్ లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.  దీంతో వారంపాటు దిగుమతులపై నిషేధం విధించింది చైనా.  గతంలో ఇండోనేషియా, రష్యా, బ్రెజిల్, ఈక్వెడార్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహారపదార్ధాల్లో కూడా కరోనా వైరస్ ఆనవాళ్లను చైనా గుర్తించి కొన్ని రోజులపాటు వాటిని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.  ఆహార ఉత్పత్తుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడుతుండటంతో చైనా అప్రమత్తం అయ్యింది.  దిగుమతి చేసుకునే ఆహారపదార్ధాలను నిశితంగా స్కాన్ చేస్తోంది. అయితే చేపల్లో కరోనా ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు చైనా అధికారులు.

Related posts