telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పెన్షనర్లకు వెసులుబాటు.. లైఫ్‌ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో..!

T-App-Folio- pension

ప్రభుత్వ పెన్షన్‌ దారులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా మాదిరిగానే పెన్షన్‌ కోసం వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని ప్రతీ పెన్షనర్‌ తప్పనిసరిగా డిసెంబర్‌ 31లోగా అందజేయాలి. ఆ విధంగా అందజేసిన వారికి మాత్రమే తదుపరి ఆర్థిక సంవత్సరం పెన్షన్‌ అందజేస్తారు. అందజేయని వారికి 2020 మార్చి నెలకు సంబంధించి పెన్షన్‌ ఏప్రిల్‌లో ఇవ్వకుండా నిలిపివేస్తారు.

అయితే, గతంలో మాదిరిగా తప్పనిసరి వ్యక్తిగతంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలనే నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో టీ ఫోలియో యాప్‌ ద్వారా కానీ, మీ సేవ కేంద్రాల నుంచి జీవన్‌ప్రమాణ్‌ సైట్‌ ద్వారా కానీ పంపించే వెసులుబాటు కల్పించారు. కాగా, మొబైల్‌ యాప్‌ ద్వారా ధ్రువీకరణ పత్రం అందజేసే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో పెన్షనర్లు వ్యక్తిగతంగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదు.

Related posts