telugu navyamedia
వార్తలు సామాజిక

కోవిడ్ నుంచి కోలుకున్నవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

corona vaccine India

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోవిడ్ బారిన పడినవారు చికిత్స పొందుతూ చాలామంది కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కోసం కేంద్రం ఆదివారం నాడు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి లోనైనవారు వ్యాధి నుంచి కోలుకున్న తరువాత కూడా కొంత కాలం పాటు అస్వస్థతకు లోనవ్వచ్చని తెలిపింది. ఇటువంటి వారి వారిలో కొన్ని సందర్భాల్లో జ్వరం, ఒళ్లునెప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

సాధారణ రోగుల కంటే ఇటువంటి వారు పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ కాలం పడుతుందని స్పష్టం చేసింది. అయితే.. రోగ నిరోధక శక్తి పెంపొందేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కూడా తాజా మార్గదర్శకాలలో కేంద్రం సూచించింది. అనారోగ్యానికి తొలి సంకేతాలైన ఆక్సిజన్ శాతం తగ్గటం, ఛాతిలో నొప్పి వంటి వాటి కోసం జాగ్రత్తగా గమనించాలని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

Related posts