telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేత రాయపాటిపై ఈడీ కేసు నమోదు

rayapati dead line to tdp on seat

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై రెండు రోజుల నుంచి దాడులు జరిపిన తరువాత, నిధుల అక్రమ మళ్లింపుపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించిన ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌టాయ్‌ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది.

సింగపూర్, మలేషియాలకు రూ. 16 కోట్లను మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. 15 బ్యాంకుల నుంచి రూ.8832 కోట్లు కంపెనీ రుణం తీసుకున్నది. రూ.3822 కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కేసును రిజిస్టర్ చేయగా, తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడం గమనార్హం.

Related posts