telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాకిస్థాన్ కు చేరుకున్న భారత వ్యాక్సిన్…

corona vacccine covid-19

మన దేశానికి నిత్య శత్రువు ఎవరు అని ఎవరిని అడిగిన చెప్పే మొదటి పేరు పాకిస్థాన్. మన ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధ వారతవరణమే ఉంటుంది.  ముఖ్యంగా బోర్డర్ లో నిత్యం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.  జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పాక్ ఇండియా మధ్య మరింత రగడ జరుగుతున్నది.  అయితే, కరోనా సమయంలో ఇండియా పాకిస్తాన్ కు స్నేహహస్తం అందించింది.  ఇండియాలో తయారైన వ్యాక్సిన్ లను పాక్ కు సరఫరా చేసేందుకు అంగీకరించింది.  గవి ఒప్పందంలో భాగంగా ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పాక్ కు ఎగుమతి చేయబోతున్నారు.  మొత్తం 4.5 కోట్ల టీకాలను పాక్ కు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది.  ఇందులో భాగంగా జూన్ నాటికి 1.6 కోట్ల డోసులను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నది.  ఇటు పాక్ కు చైనాకు 5 లక్షల టీకాలను పంపుతామని హామీ ఇచ్చింది.  ఇక ఇండియాలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లను ప్రపంచంలోని 65 దేశాలకు ఇండియా సరఫరా చేస్తున్నది. అయితే ఎన్ని దేశాలకు చేసిన పాక్ కు చేయడం పట్ల దేశంలో ఓ వర్గం ప్రజలు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related posts