telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవి ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే ?

Punarnavi

బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి భూపాలం సుమారు 76 రోజుల పాటు గడిపింది. 77వ రోజు హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ హౌస్ ద్వారా టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా క్యూట్ క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా చేశారు. ఆ తర్వాత పునర్నవి, శర్వానంద్ హీరోగా వచ్చిన “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” సినిమాలో హీరో కూతురుగా ననటించింది. ఇక ఇటీవలే “పిట్టగోడ” అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది పునర్నవి. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌజ్ ప్రేమ పక్షులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు వారాల ముందే హౌజ్ నుండే ఎలిమినేట్ అయిన పునర్నవి తన సక్సెస్‌ను సెలెబ్రెట్ చేసుకుంటోంది. ఈ మేరకు కొన్ని ఫోటోస్‌‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది అలా ఉంటే తాజాగా పున్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో “ఈ జీవితం తనకు చాలా ఇచ్చిందని.. చాలా హ్యపీ” అంటూ ఎమోషన్‌గా పోస్ట్ చేసింది. అంతేకాకుండా బీచ్‌లో ఏకాంతంగా కూర్చోని.. బ్లూ డ్రెస్‌లో ఉన్న ఓ పిక్‌ను షేర్ చేసింది. కాగా పునర్నవి ప్రస్తుతం ‘సైకిల్’, ‘చిన్న విరామం’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇకనైనా పునర్నవి హీరోయిన్ గా రాణిస్తుందేమో.

Related posts