telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జూనియర్ సింగర్స్ ఎగతాళి చేశారు… ప్రతి సంఘటన ఒక పాఠం… : సింగర్ సునీత

Singer-Sunita

టాలీవుడ్‌లో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ సునీత. ‘గులాబీ సినిమాలో ఈవేళలో నీవు ఏం చేస్తుంటావు..’ అనే పాటతో తన సినీ ప్రయాణాన్నిమొదలు పెట్టిన సునీత.. అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మెలోడీ గీతాలను మరింత మధురంగా పాడటం ఆమె ప్రత్యేకత. తాజాగా సునీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “వ్యక్తిగతంగా .. వృత్తిపరంగా జీవితం నా ముందుకు కొన్ని సవాళ్లను విసిరింది. వాటిని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగుతున్నాను. కొంతమంది జూనియర్ సింగర్స్ నన్ను ఇమిటేట్ చేస్తూ ఎగతాళి చేయడం నాకు చాలా బాధను కలిగించింది. నాతో సన్నిహితంగా ఉంటూ వచ్చినవారే నా గురించి బయట మరోలా ప్రచారం చేశారు. వాళ్లు ఎందుకు అలా చేశారనేది నాకు ఇప్పటికీ అర్థంకాని ప్రశ్న మాదిరిగానే మిగిలిపోయింది. కొన్ని వెబ్ సైట్లు నా గురించి లేనిపోనివి రాశాయి .. అందువలన వాళ్లకి ఒరిగిందేమిటనేది కూడా నాకు అర్థం కాలేదు. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనను ఒక పాఠంగా భావించడం .. ఒక అనుభవంగా స్వీకరించడం అలవాటు చేసుకున్నాను. అందువల్లనే ఇక్కడి వరకూ రాగలిగాను” అని చెప్పుకొచ్చారు.

Related posts