telugu navyamedia
సినిమా వార్తలు

ఇవి ఇండస్ట్రీలో మాకు మాత్రమే వర్తిస్తాయా ?… విమర్శలపై తాప్సి ఘాటు రియాక్షన్

Saand-ki-aank

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బయోపిక్ లు విజయవంతంగా ఆడుతున్నాయి. తాజాగా తాప్సీ, భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “సాండ్‌ కీ ఆంఖ్‌” అనే చిత్రం రూపొందుతుంది. “సాండ్‌ కీ ఆంఖ్‌” చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తెరకెక్కుతోంది. అక్కా చెల్లెళ్ళ‌కి చిన్న‌ప్పుడే పెళ్లి కావ‌డంతో త‌మ జీవితం అంతా కుటుంబం కోసం వెచ్చిస్తారు. అయితే త‌మ‌లా మిగతా వారు కాకూడ‌ద‌ని ఆరాట‌ప‌డ‌తారు. ఆ గ్రామంలో చ‌దువుల‌ని అడ్డుకునే వాళ్ళ‌ని తుపాకుల‌తో బెదిరించే వారు చంద్రో, ప్ర‌కాశీ. ఈ క్ర‌మంలో తెలియ‌ని టాలెంట్ త‌మ‌లో ఉంద‌ని గుర్తించిన ఈ ఇద్ద‌రు అక్కా చెల్లెళ్ళు ఓ సారి జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్క‌డ నుండి వారి లైఫ్ మారింది. దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు ఈ అక్కా చెల్లెళ్ళు. ఈ చిత్రంలో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా, 82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్‌ దాదీస్‌’గా మంచి పేరుంది. వారి స్వ‌స్థ‌లం బాగ్ ప‌ట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ కొద్ది రోజుల పాటు జ‌రిపారు. దీపావ‌ళి కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో అక్కా చెల్లెళ్ళుగా తాప్సీ, భూమి మంచి నటనను కనబరిచారు. అయితే ఈ సినిమాలో తాప్సీ, భూమీ ఫడ్నేకర్ అరవై ఏళ్ల వయసుపై బడిన పాత్రల్లో కనిపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ యాక్టర్స్ చేయాల్సిన పాత్రలు వీరు చేయడం సరికాదంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తాప్సి స్పందిస్తూ “ఈ విమర్శలపై తాప్సీ స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రతికూల ఆలోచనల్ని పెంచుతూ ఛాలెంజెస్‌ను ఎదుర్కొనే ధైర్యాన్ని ఆదిలోనే అణిచివేస్తున్నారు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయగలమా అని ఆలోచించే పరిస్థితి నెలకొంది. కంఫర్ట్‌జోన్‌ను వదిలిపెట్టి మార్పు కోసం కొత్తగా ప్రయత్నిస్తే అభినందించకుండా విమర్శించడం సమంజసం కాదు. వయసుకు మించిన పాత్రలు చేయకూడదనే నిబంధనలు అందరికి వర్తిస్తాయా?మా ఇద్దరికి మాత్రమేనా? అమీర్‌ఖాన్ కాలేజీ విద్యార్థిగా, ఆయుష్మాన్ ఖురానా గే పాత్రలో నటించినప్పుడు విమర్శించలేదు. కానీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వాటన్నింటికి సినిమానే సమాధానం చెబుతుంది” అని తెలిపింది.

Related posts