telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆటను కూడా .. గొడవలకు వాడుకుంటున్న … పాక్ ..

ex pak cricketer criticizes india

ఈ ప్రపంచకప్‌లో పాక్ జట్టు సెమీస్ చేరకుండా భారత జట్టు కుట్ర చేస్తోందని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో శ్రీలంక, బంగ్లాదేశ్ చేతుల్లో ఉద్దేశపూర్వకంగా ఓటమి పాలవడం ద్వారా పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తోందన్నాడు.

అటు ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన, ఆసీస్ ఓపెనర్ వార్నర్ భారత్ పై చెత్త బ్యాటింగ్ కూడా కుట్రలో భాగమేనని బాసిత్ అలీ ఆరోపించాడు. 1992 ప్రపంచకప్‌లోనూ ఇలాగే జరిగిందని, సెమీస్‌ను తమ దేశంలోనే ఆడాలన్న ఉద్దేశంతో లీగ్ మ్యాచ్‌లో పాక్ చేతిలో న్యూజిలాండ్ కావాలనే ఓడిందని అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో చిక్కుకుని క్రికెట్ నుంచి రిటైరైన బాసిత్ అలీ నోటి నుంచి ఇలాంటి ఆరోపణలు రావడంపై క్రికెట్ ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోది. అయితే కొందరు పాక్ విమర్శలను తప్పుబడుతూ, ఆటను కూడా పాక్ గొడవలకు ఉపయోగించుకుంటుంది అంటున్నారు.

Related posts