telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఆ సినిమా అంటే చంద్రబాబుకు భయం: లక్ష్మీపార్వతి

Lakshmi parvathi comments chandrababu

ఏపీ సీఎం చంద్రబాబుకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా అంటే భయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.రాయవరం మండలంలో ప్రచారంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబులోని అసలు సిసలైన కోణాన్ని దర్శకుడు రామ్‌గోపాలవర్మ చూపించారన్నారు. అందుకే తన నిజస్వరూపం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ద్వారా బట్టబయలవుతుందనే విడుదలను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.

మోదీకి భయపడనని, కేసీఆర్‌కు భయపడనని చెప్పిన చంద్రబాబులక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా అంటే మాత్రం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను విడుదల చేయాలన్నారు. చంద్రబాబునాయుడే ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యేలతో చెప్పులేయించి, ఆత్మక్షోభకు గురి చేశారన్నారు. చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని ఆమె ఆరోపించారు.

Related posts