విశాల్ హీరోగా ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో “చక్ర” అనే టైటిల్ తో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో విశాల్, శ్రద్ధాశ్రీనాథ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో రెజీనా నటిస్తోంది. రోబో శంకర్, కేఆర్ విజయ, సృష్టిడాంగే, మనోబాలా, విజయబాబు ఇతర తారాగణం. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన “అభిమన్యుడు” చిత్రానికి సీక్వెల్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఈ చిత్ర షూటింగ్ ముగియడానికి వారం రోజుల ముందు లాక్‌డౌన్ అమలులోకి రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక కొద్దిసేపటి క్రితం ‘చక్ర’ తెలుగు వర్షెన్‌కి సంబంధించిన పోస్టర్ విడుడల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుంది. ఆన్‌లైన్ వ్యాపారాల్లో మోసాలను ఎండగట్టేలా ఈ చిత్రకథను రూపొందించారు.
previous post
ఎదవ పుట్టుక… అలా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది : పూరీ