telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా.. పొత్తులపై పవన్ మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమరావతిలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని పవన్ స్పష్టం చేశారు.
.
రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే, ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

ఎవరితో పొత్తులకు వెళ్లాలో తమకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదని పవన్ అన్నారు. మంత్రి పదవులను తాము చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు పొత్తులపై వైసీపీ సలహాలు మాకెందుకున్నారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? పవన్ ప్రశ్నించారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేను.. రాష్ట్రం బలంగా ఉంటే జనసేన బలంగా ఉన్నట్లే. ఎక్కడ పోటీ చేసినా నన్ను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలవుతాయని నన్ను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలుసుండాలి. నన్ను తిడితే పదవి కలకలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారని సెటైర్లు వేశారు.

సీపీఎస్‌ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు సీపీఎస్‌ సమస్యను పరిష్కరించే తెలివి తేటలు ఉండవా?. ప్రజలకు దగ్గరయ్యే విధంగా నా యాత్ర ఉంటుందని ప‌వ‌న్ మండిప‌డ్డారు. 

ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై కేంద్రానికి పూర్తి అవగాహన వుందన్నారు. తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేసే బలం జనసేనకు వుందని పవన్ తెలిపారు. తెలంగాణలో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే అప్పుపుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఏపీ ఆర్థికపరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది.” అని పవన్ కల్యాణ్ అన్నారు.

సీపీఎస్ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని.. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివి తేటలున్నప్పుడు, సీపీఎస్ సమస్యను పరిష్కరించే తెలివితేటలు వుండవా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ అన్నారు. 

గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల తెలగాణలో పోటీ చేయలేక పోయామని చెప్పారు. రానున్న ప్రతి ఎన్నికల్లో తెలంగాణలో జనసెన పార్టీ బరిలో ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

Related posts