మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లనుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట సుజీత్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో మార్పులు చేసాడని తెలుస్తుంది. ఏడాది చివరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ పుకారు సినీ వర్గాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… మెగాస్టార్ సుజీత్ కు హ్యాండ్ ఇవ్వనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇన్ని రోజులు కష్టపడి సుజీత్ చేసిన మార్పులు చిరుకు నచ్చలేదట! అందుకే యువ దర్శకునికి బదులుగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం మంచి అనుభవం ఉన్న డైరెక్టర్ వి వి వినాయక్‌తో చేయాలనీ నిర్ణయించుకున్నారట. అయితే ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
previous post
next post