telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

జాబ్‌మేళ .. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరు.. : మైత్రిప్రియ

job mela for pharma certified

ఈనెల 27న హైదరాబాద్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. విజయ్‌నగర్‌కాలనీ, మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించే ఈ జాబ్‌మేళాకు బెట్టర్ ప్లేస్, గతి -కేడబ్యూఈ, కిమ్స్ దవాఖానలు హాజరై ఉద్యోగార్థులను ఎంచుకోనున్నాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సహా జాబ్‌మేళాకు హాజరుకావాలని , వివరాలకు 82476 56356 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

బెట్టర్‌ప్లేస్‌లో డెలివరీ పార్ట్‌నర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు -100 ఖాళీలున్నాయని, ఎస్సెస్సీ చదివి ఉండాలని తెలిపారు. గతి -కేడబ్యూఈలో కస్టమర్ డెలివరీ ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు 25 కలవని, ఎస్సెస్సీ చదివి ఉండాలని పేర్కొన్నారు. కిమ్స్ దవాఖానలో ఎస్సెస్సీ, ఇంటర్ వారికి జీడీఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, హెల్త్‌కేర్ బిల్లింగ్ ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హత గల వారు అర్హులు, వీరికి 6 మాసాల పాటు శిక్షణనిస్తారని తెలిపారు.

Related posts