బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా రైతు అవతారమెత్తి తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేశాడు. ఈ మేరకు ఒళ్లంతా బురదతో ఉన్న ఫొటోను తాజాగా సల్మాన్ షేర్ చేశాడు. లాక్‌డౌన్ కారణంగా సల్మాన్ పన్వెల్‌లోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడి తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండిస్తున్నాడు. తాజాగా బురదతో ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ “రైతులకు గౌరవం ఇవ్వండి” అని పేర్కొన్నాడు. అయితే ఆ ఫొటోపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘చేతులకు బురద పూసుకున్నావు.. కాళ్లకు పూసుకోవడం మర్చిపోయావు భాయ్” అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Respect to all the farmers . . pic.twitter.com/5kTVcVE7kt
— Salman Khan (@BeingSalmanKhan) July 14, 2020