telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలని… మీరు దగ్గర ఉంటే ముద్దు పెట్టుకోవాలనిస్తుంది… బండ్ల గణేష్ పోస్ట్ వైరల్

bandlaganesh request on movie event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ 50 రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. #AdvanceHBDPawanKalyan అంటూ ఆయన అభిమానులు జూలై 13 నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రారంభించిన 24 గంటల్లోనే పవన్ కళ్యాణ్‌కి అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తూ.. 27.3 మిలియన్లు ట్వీట్స్ రావడం విశేషం. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేవారు. అయితే కరోనా నేపథ్యంలో భారీ కటౌట్లు, మీటింగ్‌లు, కేక్ కటింగ్‌లు, బైక్ ర్యాలీలకు అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియానే వేదికగా చేసుకున్నారు ఆయన అభిమానులు. ఇప్పటి పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ హోరెత్తుతుండగా.. ఆయన భక్తుడు, గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో ట్వీట్ వదిలాడు. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలని ఆశ అంటూ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో బండ్ల గణేష్ చూపిన భక్తిని మరోసారి పవన్ బర్త్ డే సందర్భంగా ట్వీటారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్‌లో భాగంగా.. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలను జగదీష్ అనే అభిమాని బండ్ల గణేష్‌ని ట్యాగ్ చేసి వదలడంతో ఈ వీడియోను రీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ‘ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలని ఆశ.. మీరు దగ్గర ఉంటే ముద్దు పెట్టుకోవాలనిస్తుంది. మీరు నా ప్రాణం.. బాబూ అందరి ఆశీస్సులు తీసుకుని మీరు చల్లగా ఉండాలి’ అంటూ బండ్ల గణేష్ కన్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related posts