telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

జియో 3.. సిద్ధం.. స్మార్ట్ ఫోన్ లకు పోటీగా..

jio 3 may sweep smart phone industry

జియో మొదట సిమ్ కార్డు రూపంలో ప్రజలను ఆకట్టుకొని, టెలికామ్ మార్కెట్ లో సంచలనం రేపింది. దీనిదెబ్బతో చాలా కంపెనీలు కోలుకోలేని విధంగా ఢీలా పడిపోయాయి. ఇంకా కొన్ని తట్టుకొని వాటి ప్రయత్నం అవి చేస్తున్నాయి అని చెప్పేయొచ్చు. అంతలా ప్రభావం చూపిన జియో సంస్థ నుండి ఇక స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ ఫోన్ సంస్థల పరిస్థితి బహుశా జియో ఫోన్ తో చెల్లినట్టేనా.. అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఆ స్థాయిలోనే జియో స్మార్ట్ ఫోన్ ను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంత ప్రభావం చూపడానికి కారణం, సామాన్యులకు అందుబాటు ధరలలో ఉండటమే. ఈ క్రమంలో జియో ఫోన్‌ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్‌ టాపిక్‌గా నిలిచాయి. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో, పవర్‌ఫుల్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్‌ 3ని ఆవిష్కరించనుంది. ఆండ్రాయిడ్‌ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్‌, 64 స్టోరేజ్‌ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ 3 ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. ఈ ఏడాది జూన్‌లో జరిగే రిలయన్స్‌ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్‌ 3 స్మార్ట్‌గా వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చు.

Related posts