కేవలం మరికొన్ని గంటల్లో ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ సీటు కోసం తన తండ్రి రూ.6కోట్లను చెల్లించారని.. ఆప్ తరఫున పోటీ చేస్తున్న బల్బీర్ సింగ్ జఖార్ తనయుడు ఉదయ్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీకి చెందిన నేత గోపాల్ రాయల్‌కు తన తండ్రి ఆ సొమ్మును చెల్లించారని దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నాడు. సామాజికి కార్యకర్త అన్నా హజారే ఉద్యమంలో ఒక్కసారి కూడా కనిపించడని, పార్టీతో సంబంధంలేని తన తండ్రికి కేజ్రీవాల్ టికెట్ ఎలా ఇచ్చారని మీడియా సమావేశంలో ప్రశ్నించాడు.