telugu navyamedia
సినిమా వార్తలు

66 సంవత్సరాల @ “శోభ”

నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం పొన్నలూరి బ్రదర్స్ వారి “శోభ” 01-05-1958 విడుదలయ్యింది.

నిర్మాత పి. వసంత కుమార్ రెడ్డి పొన్నలూరి బ్రదర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈచిత్రానికి మాటలు: డి.వి.నరస రాజు, పాటలు: పి.వసంతకుమారరెడ్డి, సంగీతం: ఏ.ఎం.రాజా, నేపథ్య సంగీతం: అశ్వద్ధామ, ఫోటోగ్రఫీ: డి.ఎల్. నారా యణ(అన్నయ్య), కళ: గోడ్ గాంకర్, నృత్యం: వెంపటి పెదసత్యం, ఎడిటింగ్: ఎన్.సి.రాజన్, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, అంజలీదేవి, రేలంగి, రాజసులోచన, రమణారెడ్డి, ముక్కామల, హేమలత, రావి కొండలరావు, విజయలక్ష్మి, వెంకుమాంబ, డా.శివరామ కృష్ణయ్య తదితరులు నటించారు

ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు ఎ.ఎం. రాజా గారి సంగీత దర్శకత్వం లో వెలువడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
“ఆనంద సీమలోన అనురాగ మాలికల”
“రావే రావే జాబిలీ,ఈదరి రావే జాబిలీ”
“అందాల చిందు తార,డెందాన దాచనేల”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

నేపథ్యగాయకుడు ఏ.ఎం.రాజా గారు తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం “శోభ.”

ఎన్టీఆర్ గారి సినిమాలలో ఈఒక్క సినిమాకే ఏ.ఎం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. ఎక్కువుగా పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించే కమలాకర కామేశ్వరరావు గారు ఈ సాంఘిక చిత్రాన్ని కి దర్శకత్వం వహించటం విశేషం.

ఈ చిత్రం విజయవంతంగా నడిచి కొన్ని కేంద్రాలలో 50 రోజులు, ఒక్క కేంద్రం లో (విజయవాడ వినోదా టాకీస్)
100 రోజులు ప్రదర్శింపబడింది….

Related posts