telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బడా నిర్మాతతో సినిమా అంటూ రేప్ చేయబోయాడు… షాకింగ్ విషయాలు చెప్పిన రష్మీ

Rashmi

క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టి విస్తుపోయే విషయాలు వెల్లడించారు ప్రముఖ హిందీ బుల్లి తెర నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. దివంగత బాలీవుడ్ నిర్మాత యష్ రాజ్ పేరుతో ఓ వ్యక్తి తనను రేప్ చేయాలని చూసాడని తెలిపారు. ఈ విషయాన్ని రష్మీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బయటి నుంచి వచ్చే ప్రతీ అమ్మాయి క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సిందే. నేనూ ఎదుర్కొన్నాను. 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. ఏమీ తెలిసేది కాదు. మంచి వారు ఎవరో చెడ్డ వారు ఎవరో నమ్మడం తెలిసేది కాదు. ఓసారి సూరజ్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. బడా నిర్మాత అయిన యశ్ రాజ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని నెంబర్ తీసుకున్నాడు. నేను నమ్మి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పాను. రెండు రోజుల తర్వాత సూరజ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. యశ్ రాజ్ సినిమాలో ఆడిషన్స్ జరుగుతున్నాయని వెంటనే రావాలని చెప్పాడు. నేను రెడీ అయ్యి ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని వెళ్లాను. తీరా వెళ్తే.. అక్కడ ఆడిషన్స్‌ జరగడంలేదు. పైగా గదిలో సూరజ్ ఒక్కడే ఉన్నాడు. నాకు ఏదో కూల్ డ్రింక్ ఇచ్చి బలవంతంగా తాగించబోయాడు. అందులో ఏవో మాత్రలు వేసి ఉంటాడని అనిపించింది. అది తాగి ఉంటే నేను కళ్లుతిరిగి పడిపోతానని, ఆ తర్వాత రేప్ చేయాలని ప్లాన్ చేసాడు. కానీ నేను ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను. జరిగిన విషయాన్ని అమ్మకు చెప్పాను. ఆ మరుసటి రోజు అమ్మ, నేను కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడికి సూరజ్‌ని కూడా రమ్మన్నాం. అతను రాగానే అమ్మ అందరి ముందు అతని చెంప ఛెళ్లుమనిపించింది. ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. ఈ పని నేను కూడా చేసి ఉండాల్సింది అని అప్పుడు అనుకున్నాను. కానీ నాకు ధైర్యం చాలలేదు. నాకు తండ్రి లేడు. అమ్మ ఒంటరిగానే నన్ను తమ్ముడ్ని పెంచింది. అందుకే అమ్మను బాగా చూసుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి అమ్మ తప్ప మిగతావారంతా నన్ను చులకనగా చూసేవారు. నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. అందుకే పెళ్లంటూ చేసుకుంటే నన్ను ఇష్టపడే వాడిని చేసుకోవాలని అనుకున్నాను. అలా నా కోస్టార్ నందీష్ సంధుని పెళ్లి చేసుకున్నాను. కానీ మా బంధం నిలవలేదు. అసలు విడిపోతాం అని అనుకోలేదు. ఆరేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు ‘బిగ్ బాస్’ షో వల్ల నాకు కాస్త పాపులారిటీ వచ్చింది కాబట్టి ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాను’ అంటూ తన బాధను చెప్పుకున్నారు రష్మి.

Related posts