telugu navyamedia
సినిమా వార్తలు

రకుల్ పై నాగార్జున ఫైర్… అసలు నిజం ఇదే…!

manmadhudu 2 movie launch
సినిమా ఇండస్ట్రీలో ఊహాగానాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా “మన్మథుడు-2” సినిమా కోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను బరువు పెరగాలని దర్శకుడు ఆదేశించినా ఆమె పాటించకపోవడంతో నాగార్జున ఆమెపై కోప్పడ్డారని సోషల్ మీడియాలో శరవేగంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో “దే దే ప్యార్ దే” అనే సినిమా కోసం ఏకంగా 10 కిలోల మేర బరువు తగ్గింది. కానీ “మన్మథుడు-2″లో రకుల్ మరీ సన్నగా ఉంటే బాగుండదని, కాస్త వెయిట్ పెరిగితే బాగుంటుందని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ పంజాబీ బ్యూటీకి సూచించాడట. దర్శకుడు చెప్పింది రకుల్ వినకపోవడంతో, నాగార్జున ఆమెపై ఫైర్ అయ్యారని పుకార్లు షికారు చేస్తున్నాయి. 
దీనిపై స్పందించిన యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ “హీరో నాగార్జున కోప్పడ్డారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. పోర్చుగల్ లో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె మాతోనే ఉన్నారు. సెట్స్ పై ఎప్పుడూ రకుల్ ప్రీత్ అందం గురించే డిస్కషన్ జరిగేది. ప్రతిభావంతురాలైన రకుల్ లాంటి నటి మా సినిమాలో ఉన్నందుకు అదృష్టంగా ఫీలవుతుంటాం తప్ప ఆమె బరువు విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు” అని తెలిపారు.

Related posts