telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియల్ లైఫ్ లో బిడియం కలిగిన అమ్మాయినే… : రాశిఖన్నా

Rashi-Khanna

రాశి ఖన్నాకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే రాశి “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రాశి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘అరన్మణి 3’ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “ఈ మధ్య కాలంలో నేను విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్నాను. ఆ పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది గమనిస్తున్నాను. వాళ్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి, తరువాత ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నాను. నాపై గాసిప్స్ రాకపోవడానికి కారణం ఏమిటని చాలామంది అడుగుతున్నారు. అందుకు అవకాశం ఇవ్వకపోవడమే కారణం. ఒకవేళ గాసిప్స్ వచ్చినా వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఎవరినీ పోటీగా భావించకుండా నా పనిని నేను చేసుకుపోతుంటాను. ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతాను. తెరపై నేను ఎలా కనిపించినప్పటికీ, బయట మాత్రం ఆధ్యాత్మికత… బిడియం కలిగిన అమ్మాయిగానే వుంటాను. ఏ విషయంలోనైనా ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఉండటానికి నేను ఇష్టపడతాను” అని చెప్పుకొచ్చింది.

Related posts