telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అతను తండ్రి కాదు కసాయి… నెలల పాపను ఏం చేశాడంటే… !?

Saudi

సౌదీలో నెలల వయసున్న పాప సరిగ్గా నిలబడటం లేదని ఓ కసాయి తండ్రి పసిపాప అని కూడా చూడకుండా చితకబాదాడు. పాపం పసిపాప చెవులు పట్టుకుని పైకి లేపడం చూస్తే గుండె కరుక్కుపోతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తికి, ఆ వీడియో తీసిన వారికి ఉరిశిక్ష వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నసీబ్ అనే నటి ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. సౌదీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు యూసఫ్ అల్‌ఖుతియా అని తెలుసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చాలా కాలం కిందట తీసిందని.. ప్రస్తుతం యూసిఫ్ వీడియోలో ఉన్న మాదిరిగా లేడని.. వేరేలా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కొద్దికాలం క్రితం తన మానసిక స్థితి బాగోక అలా ప్రవర్తించానని.. ఇప్పుడు అలా లేనని యూసఫ్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం తన కూతురు ఎంతో ఆరోగ్యంగా ఉందని.. తన కాళ్ల మీద తాను నడుస్తోందని వివరించాడు. తన భార్య తనను, నలుగురు పిల్లలను వదిలి వెళ్లిపోయిందని.. తన పరువు తీయడానికి ఈ వీడియో ఆమె పోస్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, ఇంకా జరుగుతూనే ఉందని పోలీసులు తెలిపారు. త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

Related posts