telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిమాండ్లతో నిర్మాతలకు షాకిస్తున్న సాయి పల్లవి

Sai Pallavi

ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. సహజనటిగా సాయి పల్లవికి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. తన పాత్ర, కథ నచ్చకపోతే ఎంత పారితోషికం ఇస్తామన్నా కూడా ఆమె అంగీకరించదు. అంతేకాదు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం సాయిపల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమా నుంచి తన అద్భుత డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోన్న ఈ బ్యూటీ రానా మూవీ తర్వాత నాని నెక్స్ట్ మూవీ `శ్యామ్ సింఘరాయ్`లో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయట. ఇప్పటికే స్క్రిప్టు వినేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సాయిపల్లవి రేంజ్ పెరిగింది. ఈ అమ్మడు సినిమా ఒప్పుకోవాలంటే ఆ సినిమా తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి, గ్లామర్ షో ఉండకూడదు. ఇలా చాలానే ఉన్నాయట. పైగా అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది. ఒక్కొక్క సినిమాకు సాయి పల్లవి 2 కోట్లవరకు డిమాండ్ చేస్తుందట. ఇక శ్యామ్ సింఘరాయ్ చిత్రం విషయానికొస్తే రాహుల్ సంకృతన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు వారిలో సాయి పల్లవి ఒకరు.

Related posts