telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

హెలికాప్టర్‌ క్రాష్‌…పైలట్‌తో సహా ఐదుగురు మృతి

helicopter

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఆ రాష్ట్రంలో హెలికాఫ్టర్‌ కూలి ఐదుగురు మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. యాంకరేజ్‌ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్‌ గ్లేసియర్‌ని హెలికాఫ్టర్‌ ఢీకొనడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ మేరకు అలస్కా స్టేట్‌ ట్రూపర్స్‌ ప్రతినిధి ఆస్టిన్‌ డేనియల్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్నిక్‌ హిమనీనదం వద్ద హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైందని..ఈ ఘటన జరిగిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించగా.. పైలట్‌ సహా ఐదుగురు ప్రయాణికులు మృతిచెందినట్లు శనివారం రాత్రి గుర్తించామని అధికారులు తెలిపారు. అలస్కా ఆర్మీ నేషనల్‌ గార్డ్స్‌, మౌంటెయిన్‌ రెస్య్కూ బృందాల సాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకలపై ఫెడరల్‌ ఏవియేషన్‌ సోమవారం ఉదయం వరకు ఆంక్షలు విధించింది. మరోవైపు జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Related posts