telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కంచే చేనును మేయడం అంటే ఇదే…!

”కంచే చేనును మేయడం” అనే సామెత అందరూ వినే ఉంటారు. అయితే దానికి సరిగ్గా సరిపోయే ఉదాహరణ ఇది. స్థలం కబ్జా కాకుండా చాలా మంది డబ్బు ఖర్చు పెట్టి మరీ వాచ్ మెన్ లను నియమించుకుంటూ ఉంటారు. అలా నిలువ నీడ నిస్తే 3 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేయాలని చూశారు ముగ్గురు కేటుగాళ్ళు. అయితే చంద్రగిరి పట్టణంలో ఎంజి బ్రదర్స్ 2004లో  సుమారు 19 ఎకరాలలో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. తిరుపతికి చెందిన కొత్తపల్లి జయశ్రీ ఆమె భర్త ప్రతాప్ రెడ్డిలు 2006లో సుమారు 230 అంకణాల భూమిని కొనుగోలు చేశారు. అయితే దీనికి దీంతో కాపలా ఉన్న వ్యక్తి ఫోర్జరీ డాక్యూమెంట్స్ సృష్టించి యజమానిపై తిరగబడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజుల్లో నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే ఫోర్జరీ డాక్యుమెంట్లతో 3 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు పథకం పన్నిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చంద్రగిరి సిఐ రామచంద్రారెడ్డి అన్నారు.

Related posts