telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ నొక్కాలి: ఈసీ కొత్త నిబంధనలు

Election commision India

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కొత్త నిబంధనలను విధించింది. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఈసీ తెలిపింది. ఓటు వేసే సమయంలో ఓటర్లు సామాజికదూరాన్ని పాటించాలని చెప్పింది. ఓటర్లందరు గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ నొక్కాలని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని పేర్కొంది. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే, కేంద్ర హోంశాఖ విధించిన కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించింది.

అభ్యర్థులందరూ నామినేషన్లను ఆన్ లైన్లో దాఖలు చేయాలని ఈసీ తెలిపింది. సెక్యూరిటీ డిపాజిట్ ను కూడా ఆన్ లైన్లోనే చెల్లించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో మాస్కులు, శానిటైజర్లు ఉండాలని సూచించింది. థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.

Related posts