telugu navyamedia
క్రీడలు వార్తలు

కెప్టెన్ బాధ్యతలతో సంతోషంగా ఉన్నా : శాంసన్

గతేడాది ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములతో చెత్త ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా విఫలమైన స్టీవ్‌ స్మిత్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసిన రాయల్స్..‌ శాంసన్‌కు పగ్గాలు అప్పజెప్పింది. ఇక ఈ విషయం పై సంజూ శాంసన్‌ మాట్లాడుతూ… ‘కెప్టెన్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ను నడిపించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడం కాస్త కష్టమే అయినా ప్రయత్నిస్తా. ఈ బాధ్యతలతో మాత్రం సంతోషంగా ఉన్నా. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ కొత్త డైరెక్టర్‌, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కుమార సంగక్కరతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. అంతర్జాతీయ వికెట్‌ కీపర్‌గా శ్రీలంకకు సేవలు అందించిన సంగక్కర లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. కెప్టెన్సీ లక్షణాలతో పాటు వికెట్‌ కీపింగ్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకునే నాకు అవకాశం దొరికింది’ అని శాంసన్‌ పేర్కొన్నాడు.

Related posts