telugu navyamedia
రాజకీయ వార్తలు

“మహా” రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్ పవార్ రాజీనామా

ajit-pawar- ncp

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే చేతులెత్తేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపి ఉపముఖ్యమంత్రి పదవిని పొందిన విషయం విధితమే.

దీంతో ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి అజిత్ పై ఒత్తిడి తేవడంలో విజయం సాధించారు. తాజాగా అజిత్ ను మళ్లీ పార్టీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అజిత్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దుచేయలేదని శరద్ పవార్ ప్రకటించారు. నిన్న, కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ఉమ్మడిగా తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ మీడియా ఎదుట పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

Related posts