telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విజయవాడ ఆకాశవాణికి 75 సంవత్సరాలు.

మనదేశానికి స్వాతంత్రము వచ్చిన తరువాత ప్రసార మాధ్యమాలపై అప్పటి కేంద్ర ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది .
హైద్రాబాద్ లో అప్పటి నిజాం దక్కన్ రేడియాను నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రేడియోను ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అందుకు విజయవాడ సరైనదని భావించారు. విజయవాడకు రేడియో స్టేషన్ మంజూరయ్యింది .

1948 డిసెంబర్ 1వ తేదీ నుంచి విజయవాడలో రేడియో ప్రసారాలు ప్రారంభించింది. విజయవాడ రేడియో స్థాయిలో ఎందరో మహామహులు పనిచేసి జాతిని చైతన్యం చేసే ఎన్నో కార్యక్రాలకు రూపకల్పన చేశారు. 2023 డిసెంబర్ 1వ తేదీకి రేడియో స్టేషన్ 75 వసంతాలు పూర్తి చేసుకుంది. విజయవాడ రేడియోలో పనిచేసిన కళాకారులు కందుకూరి రామభద్ర రావు, ప్రయాగ నరసింహ శాస్త్రి పదవీ విరమణ సందర్భంగా ఒక సభ జరిగింది . అప్పుడు తీసిన అపురూప ఛాయాచిత్రం .

అందులో ముందు వరుసలో కూచున్న మహిళా కళాకారిణులు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతులు ఎ. కమల కుమారి, వి. బి.కనక దుర్గ, శ్రీరంగం గోపాలరత్నం, ఎం. నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి మరియు బి.టి.పద్మిని,  కూర్చున్నారు:  శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, ఆయన పక్కన ఎల్లా సోమన్న, వారిపక్కన  ఓలేటి వెంకటేశ్వర్లు , కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, జి వి కృష్ణారావు, రాచకొండ నృసింహ మూర్తి, ఎన్.సిహెచ్. కృష్ణమాచార్యులు వారి వెనుక నుంచున్నవారు : శ్రీయుతులు రామవరపు సుబ్బారావు,అన్నవరపుగోపాలం, ఎ.కుటుంబయ్య, దండమూడిరామమోహనరావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఉషశ్రీ, ఎం.వాసుదేవమూర్తి,  సి.రామమోహన రావు, జి.ఎం.రాధాకృష్ణ,  సితార్ కనకారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, చార్లెస్, సీతారాం
పూర్తిగా పైన నుంచున్నవారు : శ్రీయుతులు అల్లం కోటేశ్వరరావు, నండూరి సుబ్బారావు , దత్తాడ పాండురంగరాజు, సుందరంపల్లి సూర్యనారాయణ మూర్తి, ఎన్.సి వి. జగన్నాధాచార్యులు, ఎ.లింగరాజు శర్మ; ఎ.బి.ఆనంద్, మహమద్ ఖాసిం,ఆ తరువాతి వారు ఫ్లూట్ వై.సుబ్రహ్మణ్యం,. చివరివారు వై.సత్యనారాయణ.

Related posts