telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాళ్లకు టికెట్‌ ఇవ్వద్దు…

ghmc hydeerabad

రాబోయే హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రస్థుత కార్పోరేటర్ల నేర చరిత్ర గురించి విశ్లేంచింది. ఇందులో సంచలన నిజాలు బయటపడ్డాయి. గత ఎన్నికల్లో  అన్ని రాజకీయ పార్టీలు కలిసి 72 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని పేర్కొంది. దానిలో 30 మంది అభ్యర్థులు గెలిచారని.. అంటే ప్రస్థుత పాలక మండలిలో 20 శాతం మంది కార్పోరేటర్లు నేర చరిత్ర కలిగి ఉన్నారని తెలిపింది. పార్టీల వారీగా చూసుకుంటే… టీఆర్‌ఎస్‌ కు చెందిన 16 మంది, ఎంఐఎం కు చెందిన 13 మంది, బీజేపీకి చెందిన ఒకరిపై నేరచరిత్ర ఉందని పేర్కొంది.
ఎన్నికల్లో నేర చరిత్ర కలిగి ఉన్నవారు పాల్గొనటంతో… చాలా మంది జనం ముఖ్యంగా పట్టణాలలో ఓటు చేయడానికి విముఖత చూపుతున్నారని తెలిపింది. దానితో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఓటింగ్‌ శాతం పెరగాలంటే… నేర చరితులకు టికెట్లు ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని తెలిపింది. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేరచరితులకు టికెట్లు ఇవ్వవద్దని అన్ని రాజకీయ పార్టీలను ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోరింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

Related posts