కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ పఠాన్ చెరులో టీఆర్‌ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్ధాంతం లేని రాద్ధాంతపు పార్టీ బీజేపీ అని…బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా ప్రజలకు చేసిందేంటి.? అని నిలదీశారు. కరోనా వస్తే ఇళ్లలో ఉన్నది కాంగ్రెస్, బీజేపీ నేతలేనని…కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఉన్నది తామని పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుందని…బీజేపీ వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎవ్నికలంటేనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయని… కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు వేయాలన్నారు. 70 ఏళ్ప కాంగ్రెస్ , బీజేపీ పాలనలో పఠాన్ చెర్వు కు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదని…కాంగ్రెస్, బీజేపీలకు అసలు ఓటు ఎందుకు వేయాలి.? అని ప్రశ్నించారు. బీజేపీ కరోనా తో కూడా రాజకీయాలు చేస్తోందని..బీహార్ ఎన్నికలలో గెలవడానికి అక్కడి ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రచారం చేసిందని గుర్తుచేశారు. మరి తెలంగాణకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వరా..? హైదరాబాదు ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వరా.. ? అని ఎద్దేవా చేశారు. బీజేపీది దిగజారుడు రాజకీయమని… టీఆర్‌ఎస్ సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు గడప, గడపకు తీసుకెళ్లాలని సూచించారు. జీవో 58,59 కింద ఉచితంగా పఠాన్ చెరులో పేద ప్రజలకు పట్టాలిచ్చామని…సీఎం కేసీఆర్ కరోనాను దృష్టిలో పెట్టుకొని ఆస్థి పన్నును 50 శాతం తగ్గించి ఊరట నిచ్చారని కొనియడారు.
previous post