telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ తయారీలో స్పీడ్ పెంచిన చైనా

Corona

ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే విషయంలో చైనా స్పీడ్ పెంచింది. చైనా బయోఫార్మా సంస్థ సినోవాక్‌ బయోటెక్‌ దూకుడుగా ముందుకు వెళ్తోంది. కరోనావ్యాక్‌ పేరిట అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇటీవల జరిపిన‌ పరీక్షలో విజయవంతమైందని ఆ సంస్థ తెలిపింది. తాము అభివృద్ధి చేస్తోన్న ఈ వ్యాక్సిన్‌ చాలా సురక్షితమైనదని పేర్కొంది. దీనికి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడంలో మెరుగైన సామర్థ్యం ఉందని తాము గుర్తించినట్లు ప్రకటించింది.

ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు రెండు దశల్లో పరీక్షలు నిర్వహించారు. దీనికి మూడో దశ పరీక్షలను తాము బ్రెజిల్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది.ఇప్పటివరకు రెండు దశల్లో తాము ఈ వ్యాక్సిన్‌ ను పలువురిలో ప్రవేశపెట్టి ప్రయోగాలు చేయగా వారిలో 90 శాతం మందికి పైగా ఎటువంటి తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని చెప్పింది. వారిలో ఈ వ్యాక్సిన్‌ 2 వారాల్లో యాంటీ బాడీలను విజయవంతంగా ఉత్పత్తి చేసిందని తెలిపింది.

Related posts