ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు శనివారం నిరసనలు చేపట్టారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కార్మికులకు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్, సంగారెడ్డి , వికారాబాద్ జిల్లాల పరిధుల్లో ని పలు డిపోల వద్ద కార్మికులు ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీ బచావో అంటూ నినాదాలు చేశారు.
వరంగల్ డిపో 1 నుంచి ఏకశిలా పార్కు వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ లో ఆర్టీసీ బచావో అంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. కాగా పరిగి డిపో డ్రైవర్ వీరభద్రయ్య మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ వికారాబాద్ జిల్లాబంద్ కు పిలుపు నిచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డిపో ఎదుట కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది: లోకేశ్