telugu navyamedia
రాజకీయ

ఢిల్లీ సరిహద్దుల్లో ఖాళీ చేస్తున్న రైతులు..

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ముగిసింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి వ్య‌తిరేకంగా 15 నెలల ఆందోళన తర్వాత పంజాబ్ హర్యానాలోని తమ గ్రామాలకు తిరిగి వెళుతున్న నేప‌థ్యంలో ఢిల్లీలోని సింఘు, టిక్రి , ఘాజీపూర్ సరిహద్దుల్లో క్యాంప్ చేస్తున్న రైతులు ఈరోజు విజయ యాత్ర చేపట్టనున్నారు.

After year-long protest, farmers begin journey back home

సుదీర్ఘ నిరసనలకు తెరదించుతూ దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. పెండింగ్​ డిమాండ్లపై కేంద్రం నుంచి అధికారిక లేఖ అందిన క్రమంలో ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించిన అన్నదాతలు.. స్వస్థలాలకు పయనమయ్యారు. గుడారాలు, శిబిరాలను తొలగించి సామాన్లను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్లను అందంగా ముస్తాబు చేసి విజయ యాత్ర చేపట్టారు. పలువురు రైతులు నృత్యాలు చేశారు. ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు.

After year-long protest, farmers begin journey back home - OrissaPOST

ఈ విజయయాత్రను ముందుగా గురువార‌మే నిర్వహించాలని భావించారు, అయితే తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన నేపథ్యంలో అది వాయిదా పడింది.

After Year-Long Protest, Farmers Begin Journey Back Home | Newsmobile

కాగా..నూతన సాగుచట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టడంతో.. కేంద్రంలోని మోడీ సర్కార్ దిగొచ్చి ఆ చట్టాలను రద్దు చేసింది. అయితే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కేంద్రం నుంచి అధికారిక లేఖ అందడంతో రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు.

Indian farmers clash with police in Delhi as protests mount | The Japan  Times

అయితే ఇది పూర్తి విర‌మ‌ణ కాద‌ని, తాత్కాలికంగానే విర‌మిస్తున్నామ‌ని, కేంద్రం ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ని ప‌క్షంలో మ‌రోసారి ఉద్య‌మానికి స‌న్న‌ద్ధ‌మ‌వడం ఖాయ‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.  జనవరి 15న మరోసారి సమావేశమై ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చిందో లేదో చర్చిస్తామని రైతు నేతలు చెప్పారు. ఈ ఏడాది కాలంలో తమకు సహకరించిన వారిని సన్మానిస్తామని తెలిపారు

Related posts