ఇటీవల తమిళనాడుతో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన సతీమణి సహా 13 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్‌ఏ టెస్టులు చేసి ఆరుగురు జవాన్ల భౌతికకాయాలను గుర్తించారు.
మొదట చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ, మరో లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతికకాయాలను గుర్తించినట్లు ప్రకటించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో వారి వారి స్వగ్రామానికి తరలిస్తున్నారు.
అయితే ఈ రోజు సాయంత్రానికి సాయితేజ భౌతికకాయం జిల్లాకు చేరుకోవడంతో రేపు సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జగన్ సర్కార్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఇక అందుకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ సాయితేజ కుటుంబానికి అందించినట్లు తెలుస్తోంది.
ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే డబ్బు కట్టాలా?: చంద్రబాబు