telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల: మహిళలు, రైతులు, నిరుద్యోగులపై వరాల జల్లులు, పథకాలివే

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. గతంలో సూపర్‌ సిక్స్‌ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన ఆరు హామీలకు మరి కొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలోని కీలకమైన హామీలు ఇలా ఉన్నాయి.

కూటమి మేనిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు

*ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

*మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

*రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

*వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

*ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం

*ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

*ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

*భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

*చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

*పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

*పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.

*ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ

చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు

*బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం

*మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం

*స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం

*డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

*చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు

*దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

*బీసీలకు 50 ఏళ్లకే పింఛను

*18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

*యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

*నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగభృతి

*తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల

నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అంటూ ఈ మేనిఫఎస్టోను రూపొందించారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని కొత్త పథకాలను ఎన్డీఏ కూటమి ప్రకటించింది.

Related posts