telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ రాజకీయ

అమెరికా వాణిజ్య యుద్ధం.. సొంత దేశ వినియోగదారుల ఇబ్బందులు..

americans effected on trade war

ఎవరు తీసుకున్న గోతోలో వల్లే పడ్డట్టుగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఆ దేశస్థులకే భారంగా మారింది. చైనాకు నుంచి దిగుమతి అయ్యే 300 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వినియోగదారులు అదనంగా 12.2 బిలియన్‌ డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. ముఖ్యంగా దుస్తులు, ఫుట్‌వేర్‌, గృహోపకరణలపై ఈ భారం పడుతోందని ది నేషనల్‌ రీటైల్‌ ఫెడరేషన్‌(ఎన్‌ఆర్‌ఎఫ్‌) పేర్కొంది.

అమెరికన్లు ఇప్పుడు టారీఫ్‌ల కారణంగా దుస్తులపై 4.4బిలియన్‌ డాలర్లు, పాదరక్షలపై 2.5 బిలియన్‌ డాలర్లు, బొమ్మలపై 3.7 బిలియన్‌ డాలర్లు, గృహోపకరణాలపై 1.6 బిలియన్‌ డాలర్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మార్కెట్లు ఈ వ్యాపారాలకు అనుకూలంగా ఉండవు. దిగుమతుల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.కొద్ది రోజులు చైనా సరఫరాదారులనే కొనసాగించి ఆ భారం వినియోగదారులపై మోపుతారు.. అని ఎన్‌ఆర్‌ఎఫ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ఫ్రెంచ్‌ తెలిపారు. మరోపక్క అమెరికా ఫ్యాషన్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం టారీఫ్‌ల కారణంగా వినియోగదారులపై 4.9 బిలియన్‌ డాలర్ల మేరకు అదనపు భారం పడుతోందని తేలింది.

Related posts