telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీసీఎం .. కియ పరిశ్రమ సందర్శన..

kia-motors

ఏపీసీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీ కియ పరిశ్రమను సందర్శించనున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నవరత్నాల అమలుపై నివేదిక తయారు చేయాలన్నారు.

ఆయాశాఖల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం కియ సందర్శన నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి జేసీ సుబ్బరాజు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్లను ఆదేశించారు.

Related posts