ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ లు వెంకయ్యనాయుడుని కలిసి ఈ లేఖను అందజేశారు.టీడీపీని విభేదించి బయటకు వచ్చామని వారు వెల్లడించారు.
అనతరం టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. వారం రోజుల క్రితమే తమ అధినేత చంద్రబాబును కలిశానని చెప్పారు. పార్టీని వీడొద్దని, పార్టీకి నష్టం కలిగించొద్దని తనకు సూచించారని అన్నారు.