telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ మొండిచేయి?

cm kcr red signal to 3 sitting mps

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కూడా కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక పై ఓ నిర్ణాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 16 ఎంపీ సీట్లను గెలిచేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో అన్ని రకాల అంశాలను పరిగణనలోనికి తీసుకుంటున్న గులాబీ బాస్ సిట్టింగులలో ముగ్గురికి మొండి చేయి చూపే అవకాశం కనిపిస్తోంది.

మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌లకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంగళవారం మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి జితేందర్‌రెడ్డి, పొంగులేటి, సీతారాంనాయక్‌లకు ఆహ్వానం పంపలేదు. ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నందున జితేందర్‌రెడ్డికి టికెట్ దక్కే అవకాశం లేకపోవచ్చు. ఖమ్మం ఎంపీ పొంగులేటిపై కేటీఆర్ కొంత సానుకూలంగా ఉన్నా కేసీఆర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ అనే వ్యాపారవేత్త పేరును దాదాపుగా ఖరారు చేశారు.
ఖరారైన ఎంపీ అభ్యర్థులు వీరే:

1. బోయినపల్లి వినోద్‌కుమార్- కరీంనగర్
2. కల్వకుంట్ల కవిత- నిజామాబాద్
3. కొత్త ప్రభాకర్‌రెడ్డి- మెదక్
4. బీబీ పాటిల్- జహీరాబాద్
5. బూర నర్సయ్యగౌడ్- భువనగిరి
6. జి.నగేశ్- ఆదిలాబాద్

Related posts