telugu navyamedia
సినిమా వార్తలు

54 సంవత్సరాల “పెత్తందార్లు”

నటరత్న ఎన్. టి.రామారావు గారు నటించిన సాంఘీక చిత్రం జ్యోతి సినీ సిండికేట్ వారి “పెత్తందార్లు”  సినిమా 30-04-1970 విడుదలయ్యింది.

నిర్మాత యు. విశ్వేశ్వరరావు గారు జ్యోతి సినీ సిండికేట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: త్రిపురనేని మహారధి, స్క్రీన్ ప్లే: సి.ఎస్.రావు, సంగీతం: కె.వి.మహదేవన్, పాటలు: శ్రీ శ్రీ, దాశరధి, ఆరుద్ర, కోసరాజు, వేటూరి, ఫోటోగ్రఫీ: జి.కె.రాము, కళ: ఎస్.కృష్ణారావు, నృత్యం: తంగప్ప, కూర్పు: ఆర్.హనుమంతరావు అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, సావిత్రి, విజయ నిర్మల, శోభన్ బాబు, నాగయ్య, నాగభూషణం, రేలంగి, ప్రభాకర రెడ్డి, సత్యనారాయణ, ధూళిపాళ, రాజబాబు,రమాప్రభ, ముక్కామల, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, విజయలలిత , జ్యోతిలక్ష్మి, రాధాకుమారి, చలపతిరావు, బేబీ రాణి తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు హిట్ అయ్యాయి.
“నాదేశం కోసం నడుం బిగించి నాగలి పట్టానోయ్”
“మానవుడా ఓ మానవుడా విన్నావా,ఇది విన్నావా ”
“దగ్గరగా ఇంకాదగ్గరగా చెక్కిలి పై చెక్కిలిగా”
“మా పాడిపంటలు చల్లంగ చూడు”
“ఏకాంత సేవకు వేళాయేరా ఈకాంత నీకొరకే వేచేనురా”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

నిర్మాత విశ్వేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారితో నిర్మించిన మూడవ చిత్రం “పెత్తందార్లు”. ఈ చిత్రంలో బుర్రకధ గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అభ్యుదయ భావాలు కలిగిన కథతో రైతులకు, పెత్తం దారుల మధ్య జరిగే వర్గ పోరాటం ఇతివృత్తంగా ఈ
సినిమా ను తెరకెక్కించారు.

అమాయక రైతుల పొట్టకొడుతూ కాసులు కూడబెట్టుకునే పెత్తందార్లు అకృత్యాలను ఈ చిత్రంలో ఎత్తిచూపారు.

ఈ చిత్రం మంచి విజయం సాధించి పలు కేంద్రాలలో
50 రోజులు ప్రదర్శింపబడి, 3 కేంద్రాలలో100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది.
1. విజయవాడ – జైహింద్ టాకీస్
2. గుంటూరు – హరిహర మహల్,
3. తెనాలి – వీనస్ థియేటర్లలో
డైరెక్టుగా100 రోజులు ప్రదర్శింపబడింది.

Related posts