telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియాంక చోప్రాకు కరీనా కపూర్ వార్నింగ్

Kareena-Kapoor-and-Priyanka-Chopra

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా కలిసి తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించే పాపులర్ షో “కాఫీ విత్ కరణ్” కార్యక్రమానికి వచ్చారు. ఈ షోలో భాగంగా కరణ్ “వరుణ్ ధావన్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి ?” అంటూ ప్రియాంకను అడిగారు. దానికి సమాధానంగా ప్రియాంక తనకు తెలియదని చెప్పింది. వెంటనే స్పందించిన కరీనా కపూర్ “అయితే నీకిప్పుడు కేవలం హాలీవుడ్ యాక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయా ? నీ సమాధానం వింటే అలాగే ఉంది. మూలాలు ఇక్కడివే… మర్చిపోవద్దు” అని నవ్వుతూ ప్రియాంకకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కరీనా కపూర్.

ఇక ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. కరీనా కపూర్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి తైమూర్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పటికీ కరీనా కపూర్ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్, అక్షయ్ కుమార్ జంటగా “గుడ్ న్యూస్” అనే సినిమా రూపొందుతోంది. ఇక ప్రియాంక చోప్రా ఇటీవలే అమెరికా సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకుని హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ప్రియాంక “ది స్కై ఈజ్ పింక్” అనే సినిమాలో నటిస్తోంది.

Related posts