పదేళ్ళ క్రితం 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో శ్రుతీహాసన్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా శ్రుతికి నిరాశను కలిగించింది. అలానే అటు హిందీ, ఇటు తమిళ సినిమాలు సైతం వరుసగా పరాజయం పాలయ్యాయి. అదే సమయంలో కాప్ స్టోరీ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ శుత్రికి తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ పవర్ కళ్యాణ్ భార్యగా తొలి విజయాన్ని తన ఖాతాలో తెలుగులో నమోదు చేసుకున్న శ్రుతీహాసన్ ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… కాప్ స్టోరీ ‘క్రాక్’తోనే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లోనూ ఈ భామ ఉంది. అయితే.. తాజాగా మరో మెగా అవకాశానికి శ్రుతి హాసన్ చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు శ్రుతి పేరును పరిశీస్తున్నారట. పవర్‌ఫుల్ ఎమోషనల్ కథతో బాబీ రూపొందించనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు శ్రుతితో పాటు రకుల్ ప్రీత్, మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారట. అయితే.. ఆ ఛాన్స్ పొందే అవకాశాలు శ్రుతికే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా.. ఇటీవలే సలార్ మూవీలోనూ ఈ భామ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.