telugu navyamedia
సినిమా వార్తలు

“బాయ్” సెన్సార్ పూర్తి… క్లీన్ “యూ”

Boy-Movie

విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బాయ్”. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ “యూ” సర్టిఫికేట్ ను ఇచ్చింది సెన్సార్ బోర్డు. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి మంచి ప్రశంసలు కూడా అందాయట. ఉగాది రోజు అన్నపూర్ణ స్టుడియోస్‌లో “మహర్షి” సినిమా సెట్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి లాంచ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. హై స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న స్టూడెంట్, కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ చూస్తుంటే డైరెక్టర్ అమర్ ఈ సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చూచాయగా కనిపిస్తోందని వంశీ పైడిపల్లి అన్నారు. ఈ చిత్రంలో లక్ష్య, సాహితి, నీరజ్, వినయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు.

Related posts