telugu navyamedia
సినిమా వార్తలు

కొడుకు విడియో.. మేఘన రాజ్ ఎమోష‌న‌ల్

దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ సర్జా తన కుమారుడు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాడు. చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా ఒక అందమైన వీడియో షేర్‌ చేశారు.

Late Chiranjeevi Sarja and Meghana Raj's son named Raayan Raj Sarja; Watch priceless VIDEO | PINKVILLA

చిరు, మేఘనా తనయుడు రాయన్‌ రాజ్‌తో ఆడుకుంటూ, ముద్దాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. భార్య ప్రేరణతో కలిసి రాయల్‌ రాజ్‌ను ఎత్తుకున్న ఫోటోను, అలాగే బుజ్జి రాయన్‌ కాలితో ధృవను తన్నుతున్న ఫోటో కూడా యాడ్‌ చేశారు. దీనిపై తల్లి మేఘనా రాజ్‌ భావోద్వేగంతో స్పందించారు. ఇటీవ‌ల మేఘన, ప్ర‌స్తుతం ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

సోదరుడు అకాల మరణం తరువాత మేఘనను అక్కున చేర్చుకొని అన్నీ తానే అయి చూసుకున్నాడు ధృవ. ఈ క్రమంలో భర్తలేని లోటు తెలియనివ్వకుండా మేఘనాకు ఘనంగా సీమంతం జరిపించాడు. అంతేకాదు తన అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ 10 లక్షలురూపాయల వెండి ఉయ్యాలను బహుమతిగా ఇవ్వడం విశేషంగా నిలిచింది.

2018లో చిరు సర్జా, నటి మేఘనాను ప్రేమించిపెళ్లి చేసుకున్నాడు. ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. కన్నడలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఆయన.. ఎన్నో ఏళ్ల భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుండగా విధి పగ బట్టడంతో మరణించాడు.

 పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోవడం.. ఆయన చనిపోయే సమయానికి భార్య 5 నెలల గర్భవతి కావడం కంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. ఈ రెండూ కన్నడ హీరో చిరంజీవి సర్జ భార్య మేఘన రాజ్ విషయంలో జరిగాయి. కన్నడ నాట స్టార్ హీరోగా అడుగులు వేస్తున్న సమయంలోనే కేవలం 35 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించాడు చిరంజీవి సర్జ. ఆయన మరణం కన్నడనాట నంచలనం. 

పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోవడం.. ఆయన చనిపోయే సమయానికి భార్య 5 నెలల గర్భవతి కావడం అందర్నీ దిగ్భ్రాంతి కి గురి చేసింది. గతేడాది జూన్‌ 7న తీవ్ర గుండెపోటుతో 35 ఏళ్లకే కన్నుమూశారు. భార్య మేఘన రాజ్ ఎంతో కుంగిపోయారు. అయితే అక్టోబర్‌ 22న పండంటి మగబిడ్డకు జన‍్మనివ్వడంతో ఈ విషాదంనుంచి మేఘనకు కాస్తంత ఊరట లభించింది.

తరచూ తన భావాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకునే మేఘనా తన చిన్నారి, జూనియర్‌ చిరు పేరును ‘‘రాయన్‌ రాజ్‌’’ అంటూ ఇటీవల చిరంజీవి సర్జా వివాహ దృశ్యాలను కలిగి ఉన్న ఒక బ్యూటిఫుల్‌ వీడియోను షేర్‌ చేశారు. కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించారు.

 ఆయన భార్య మేఘన రాజ్ విషయంలో ఎంతో కుంగిపోయారు. చిరంజీవి చనిపోయిన నాలుగు నెలల తర్వాత మేఘనకు అబ్బాయి పుట్టాడు. అతడిని మొన్నటి వరకు జూనియర్ చిరంజీవి సర్జ అని పిలిచేవారు.  అయితే తాజాగా తమ వారసుడి పేరు అధికారికంగా ప్రకటించింది మేఘనా రాజ్. చిరు కొడుక్కి రాయన్ రాజ్ సర్జ అనే నామకరణం చేసారు.

Related posts