telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’లో మరో అగ్రహీరో… క్లారిటీ ఇవ్వనున్నరాజమౌళి

rrr

రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా సీతారామరాజు గా చరణ్ ఎంట్రీ అదిరింది. దీనికి తోడు ఎన్టీఆర్ తెలంగాణా యాసలో వాయిస్ ఓవర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇప్పుడు మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. కాగా ఆర్ ఆర్ ఆర్ గురించిన మరో వార్త ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో తాజాగా మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ రోల్ ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related posts