telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్లాస్మా దానం చేసిన సంగీత దర్శకుడు కీరవాణి

Keeravani

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. కరోనాకు మందు లేని పరిస్థితుల్లో ప్లాస్మా దానం చేయడం అనేది బాధితుల పాలిట సంజీవనిగా మారింది. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం వారు బతికే అవకాశం ఉంది. ప్లాస్మాలో ఉండే యాంటీబాడీల వల్ల కరోనా సోకిన వ్యక్తి దాని నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ఒక్కరు ప్లాస్మా దానం చేస్తే దాని వల్ల 30 మందికి సాయం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు భైరవతో కలిసి కిమ్స్‌ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్‌ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉందని, అందులో భయపడవలసిన అవసరం లేదని కీరవాణి పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న ప్రముఖులు ప్లాస్మా దానం చేస్తే మరికొంతమంది కరోనా బాధితులను కాపాడవచ్చు.

Related posts